క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యం....

క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యం....

06/March/2026 07:21    Share:   

  • జిల్లా వైద్య అధికారి డాక్టర్ స్వప్న
    టిబీ విముక్త భారత్ అభియాన్‌లో భాగంగా క్షయ వ్యాధిని పూర్తిగా నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ స్వప్న తెలిపారు. రాంబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొప్పుగొండుపాలెం, కొత్తపేట, దిమిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ములకాడ, మర్రిపాలెం గ్రామాలను 'క్షయ రహిత గ్రామాలు'గా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ ఎంపిక చేసిన గ్రామాల్లో టిబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ఉచితంగా టిబీ పరీక్షలు, ఎక్స్ రే సదుపాయాలను కల్పిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు, పౌష్టికాహారాన్ని కూడా అందజేస్తామని ఆమె పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ ఆరోగ్య సేవలను వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేష్, డాక్టర్ అనిల్, డాక్టర్ దీపికలతో పాటు సూపర్ వైజర్లు రఘు, సత్యనారాయణ, రాజు, ధనరాజ్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter