ఒడిశాలో ఒక్క రూపాయికే వైద్యం.. డాక్టర్‌ రామ్‌చందాని ఆదర్సవంతమైన  సేవలు

ఒడిశాలో ఒక్క రూపాయికే వైద్యం.. డాక్టర్‌ రామ్‌చందాని ఆదర్సవంతమైన సేవలు

15/February/2026 09:00    Share:   

ప్రస్తుత సమాజంలో వైద్య ఖర్చులను అంచనా వేయలేం. పేద కుటుంబాలకు ఈ ఖర్చులు మితిమీరిన భారం. ఇలాంటి వారి కోసం ఒడిశాకు చెందిన డాక్టర్‌ శంకర్‌ రామ్‌చందాని కేవలం ఒక్క రూపాయి ఫీజుగా తీసుకొని వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య డాక్టర్‌ శిఖ ఆయనకు తోడుగా నిలుస్తున్నారు.ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ఉన్న వీర్‌సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌లో శంకర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పేదలకు సేవ చేయాలనే ఆశయంతో తన క్లినిక్‌లో ఈసీజీ, ఔషధాలు, నెబ్యులైజేషన్‌ వంటి సదుపాయాలను రూపాయికే అందిస్తున్నారు.

Breaking News

Subscribe our Newsletter