Mar 10, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన నేడు సచివాలయంలో 59వ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) సమావేశం జరిగింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, జీవోఎంల నిర్ణయాలు, సచివాలయం, హెచ్వోడీ భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఈ సమావేశంలో సమీక్షించారు. అదే విధంగా ఈపీసీ పద్దతిన తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటు, రాజధాని పరిధిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై కూడా చర్చ జరిగింది. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి శ్రీ పి.నారాయణ, ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్, పట్టణాభివృద్ధి, సీఆర్డీఏ, ఏడీసీఎల్ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.