సేంద్రియ ఆహార ధాన్యాలు తో మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.
10/March/2026 07:12
Share:
సేంద్రియ ఆహార ధాన్యాలు తో మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కొండల ప్రసాద్ CA న్యూస్ ఏలూరు ఇంచార్జి ఏలూరు:సేంద్రియ ఎరువుల వినియోగంతో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగంతో మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక గోదావరి సమావేశపు హాలులో సోమవారం పిజిఆర్ ఎస్ కార్యక్రమ సమయంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు,వంటనూనెలను రైతులు కలెక్టర్ కు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రసాయనిక ఎరువుల ద్వారా సాగు చేసిన ఆహార పదార్థాలు వినియోగం కారణంగా కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురికావచ్చని, ప్రకృతిసిద్ధమైన సేంద్రియ ఎరువుల వినియోగంతో పండించిన ఆహార ధాన్యాలు, కూరగాయలు, వంట నూనెల వంటి వాటి వినియోగం ద్వారా అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని, ప్రజలు సేంద్రియ వినియోగంతో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహార ఉత్పత్తుల వినియోగించాలన్నారు.ముందుగా జిల్లాలోని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులని వినియోగించి, ప్రజలలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ఆరోగ్య ప్రయోజనాలపై విస్తృత అవగాహన కలిగించాలన్నారు.ఈ కార్యక్రమములో డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, వ్యవసాయ శాఖాధికారి హబీబ్ భాషా, ఉద్యానవనాలు శాఖాధికారి సాజా నాయక్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారి రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.