ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు..

ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు..

21/August/2026 20:36    Share:   

అనకాపల్లి (ఎ.కోడూరు), ఆగస్టు 21:
కె.కోటపాడు మండలం, ఎ.కోడూరు గ్రామంలో ఉదయం "స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు తెలిపారు. ఈ సందర్బంగా ప్రజలు, వాహనదారులు, మరియు కార్యక్రమానికి వచ్చే కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృతమైన ట్రాఫిక్ డైవర్షన్లు మరియు పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
 
​ఆగస్టు 22, 2026 ఉదయం 7:00 గంటల నుండి ఎ.కోడూరు మీదుగా ఎటువంటి వాహనాల రాకపోకలను అనుమతించబోరని స్పష్టం చేశారు.  
ట్రాఫిక్ మళ్లింపులు (డైవర్షన్లు): 
​పినగాడి నుండి దేవరాపల్లి: వెళ్లే భారీ వాహనాలు కొత్తవలస మీదుగా వెళ్ళాలి.​దేవరాపల్లి నుండి విశాఖపట్నం: వెళ్లే వాహనాలు కొత్తవలస మీదుగా పయనించాలి.​దేవరాపల్లి నుండి అనకాపల్లి, చోడవరం: వెళ్లే వాహనాలు లంకవానిపాలెం, పిండ్రంగి, దాలివలస, రామచంద్రాపురం, కె. కోటపాడు మీదుగా వెళ్ళాలి.  
​వెంకన్నపాలెం నుండి దేవరాపల్లి: వెళ్లే వాహనాలు చౌడువాడ నుండి పాచిలవానిపాలెం మీదుగా వెళ్ళవలసిందిగా కోరడమైనది.కార్యక్రమానికి వచ్చేవారి కోసం పార్కింగ్ ఏర్పాట్లు: 
​"స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసే ప్రజలు, కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు.  
​వి.మాడుగుల, చౌడువాడ, గొండుపాలెం, రొంగలినాయుడుపాలెం, పైడంపేట, పాసిలవాణిపాలెం, అలాగే సూదివలస, చంద్రయ్యపేట, కె.సంతపాలెం, కె.కోటపాడు, గొట్లం, పాతవలస గ్రామాల నుండి వచ్చే వారు చోడవరం లేదా కె.కోటపాడు రావాలమ్మ తల్లి గుడి, మెడీచర్ల మీదుగా వచ్చి సూరెడ్డిపాలెం వద్ద ఉన్న లేఅవుట్ లో తమ వాహనాలను పార్క్ చేసుకోవాలి.
  
​చీడికాడ మరియు దేవరాపల్లి మండలాల నుండి వచ్చే వారు తురువోలు, ఆలమండ లేదా ఆనందపురం మార్గాల్లో వచ్చి ఎ.కోడూరులోని రంగరాయ చెరువు వద్ద కేటాయించిన స్థలంలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.  
​లంకవానిపాలెం, కొరువాడ, ఆనందపురం, వి.సంతపాలెం, డి.అగ్రహారం, వారడ గ్రామాల ప్రజలు ఎ.కోడూరులోని గంగరాజు చెరువు వద్ద, దాలివలస, సింగన్నదొరపాలెం వాసులు సూరెడ్డిపాలెం గ్రామంలోని సా మిల్ (Saw Mill) వద్ద వాహనాలు నిలుపుకోవాలి.  
​మర్రివలస, శృంగవరం, పిండ్రంగి, గవరపాలెం, K.J.పురం, కొత్త అగ్రహారం గ్రామాల నుండి వచ్చే వారు ఎ.కోడూరు గవర్నమెంట్ హాస్టల్ ఎదురుగా ఉన్న గాయత్రి స్కూల్ ఆవరణలో పార్కింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.​ప్రజలందరూ ఈ ట్రాఫిక్ సూచనలను గమనించి, పోలీసు శాఖకు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ కోరారు.  
Breaking News

Subscribe our Newsletter