కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
గోదావరి నదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలో వరద పరిస్థితిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ చెప్పారు. జిల్లాలో గోదావరి వరద పరిస్థితులుపై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టరేటు జిల్లా జాయింటు కలెక్టరు ఛాంబరు నుండి గురువారం జేసీ సంబంధిత శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ గోదావరి నదీపరీవాహక ప్రాంతంలో కొనసాగుతున్న భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లాలోని గోదావరి నది పరివాహక ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లోని కొన్ని గ్రామాలలో వరద ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆయా ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలుపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. వరద పరిస్థితులపై ప్రత్యేక అధికారులను నియమిస్తూ, కంట్రోల్ రూమ్ లు 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన సహాయక చర్యలకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, అగ్నిమాపక, ఎన్‌డీఆర్ యఫ్/ఎస్‌డీఆర్‌ఎఫ్ తదితర శాఖలు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేలా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. వరద పరిస్థితులుపై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ప్రజలకు అందించాలని, పుకార్లను, వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని ప్రజలకు తెలియజేయాలన్నారు.