మైహోమ్ ఇండస్ట్రీస్‌కు ‘స్కోడాప్ హానర్’ అవార్డు రావడం అభినందనీయం: జె. శివశంకర్ రెడ్డి
31/March/2026 21:12
Share:
అనకాపల్లి జిల్లా, యలమంచిలి మండలం, ములకలాపల్లి గ్రామం నందు గల మైహోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (సిమెంట్ ఫ్యాక్టరీ) జరుపుకున్న 55 వ భద్రతా వారోత్సవాలు ముంగింపు సందర్బంగా ముగింపు సభకు గౌరవనీయులు జాయింట్ చీఫ్ ఇనస్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ శ్రీ జె.శివ శంకర్ రెడ్డిగారు గౌరవ అతిధిగా పాల్గొన్నారు వారు మాట్లాడుతూ సిమెంట్ ఫ్యాక్టరీకి స్కోడాప్ హానర్ అవార్డు రావడం అభినందనీయం అని తెలిపారు. పనిలో నోస్ మాస్క్ హెల్మెట్ సేఫ్టీ జాకెట్ తప్పని సరిగా దరించి పనిచేయాలని తెలియజేసారు, ఎత్తు ప్రదేశాలలో సేఫ్టీ పరికరాలు తప్పని సరిగా వేసుకొనే పనిచేయాలని సూచించారు, అందరూ భద్రతతో పనిచేయాలని సూచించారు, ఈ భద్రతా వారోత్సవాలు సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ క్విజ్ కాంపిటేషను నందు పాల్గొన్న ఉద్యోగులు మరియు కార్మికులకు బహుమతులు ప్రధానం చేసారు. ఈ కార్యక్రమములోజాయింట్ చీఫ్ ఇనస్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ శ్రీ జె.శివ శంకర్ రెడ్డిగారు, ఫ్యాక్టరీ యూనిట్ హెడ్ శ్రీ బి.రామస్వామి గారు, సీనియర్ డి.జి.ఎమ్ (పి.అండ్.ఎ) శ్రీ ఎల్ శ్రీనివాసరావు గారు, మేనేజర్ సేఫ్టీ శ్రీ కె. సతీష్ రెడ్డి గారు, హెచ్. ఓ. డి లు, ఇతర ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు.