రేగుపాలం–ఎలమంచిలి రహదారి మరమ్మతులకు శ్రీకారం..!!

రేగుపాలం–ఎలమంచిలి రహదారి మరమ్మతులకు శ్రీకారం..!!

17/August/2026 19:39    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
రేగుపాలం ఎన్‌హెచ్‌–5 నుంచి ఎలమంచిలి పట్టణంలోని కోటారి వారి పెట్రోల్ బంక్ వరకు గుంతలతో అధ్వానంగా మారిన రహదారికి ఎట్టకేలకు మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ప్యాచ్‌వర్క్ ద్వారా గుంతలను పూడ్చి తారు వేస్తూ రహదారిని అభివృద్ధి చేస్తున్నారు.
ఈ రహదారిపై గుంతల కారణంగా గతంలో పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణనష్టం కూడా సంభవించింది. దీంతో రహదారి దుస్థితిని స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు.దీర్ఘకాలంగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ఈ సమస్యపై ప్రస్తుత ప్రభుత్వం స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టడంపై స్థానిక గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ పనులను ఏఈ సత్యవాణి పర్యవేక్షించగా, లైన్ కొత్తూరు పంచాయతీ జనసేన నాయకులు లాలం సోమునాయుడు, ఇతర జనసేన నాయకులు, కూటమి నాయకులు పాల్గొని పనులను దగ్గరుండి పరిశీలించారు.
రహదారి మరమ్మతులకు చొరవ చూపిన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, అధికారులకు, స్థానిక జనసేన మరియు కూటమి నాయకులకు గ్రామ ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter