ప్రజల సమస్యల పరిష్కారానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చొరవ

ప్రజల సమస్యల పరిష్కారానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చొరవ

09/October/2026 20:41    Share:   

ప్రజాదర్బార్‌కు విశేష స్పందన
అర్జీలను నాణ్యవంతంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు

గజపతినగరం, అక్టోబరు 9:

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాదర్బార్‌కు విశేష స్పందన లభించింది. ‘ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గజపతినగరం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌)లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ, భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కొరత తదితర అంశాలపై ప్రజలు మంత్రికి అర్జీలు సమర్పించారు.ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు, అర్హతల మేరకు సమస్యలను పరిష్కరించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదేపదే తిరిగే పరిస్థితి ఉండకూడదని, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని స్పష్టం చేశారు.ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడంతో పాటు, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపించడమే ప్రజాదర్బార్ ప్రధాన ఉద్దేశమని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమైంది.

క్రైమ్ ఎనాలసిస్ గజపతినగరం రిపోర్టర్ పీ లా సురేష్
Breaking News

Subscribe our Newsletter