మరిడిమాంబ అమ్మవారిని దర్శించుకున్నటిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ

మరిడిమాంబ అమ్మవారిని దర్శించుకున్నటిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ

05/March/2026 20:48    Share:   

యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం తోటాడ పంచాయతీలో వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ మారిడిమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, గ్రామ ప్రజలకు శాంతి, సౌభాగ్యం కలగాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు పెంటకోట విజయ్, జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు అడారి మంజు, క్లస్టర్ ఇన్‌చార్జ్ దొడ్డి రమేష్, సీనియర్ నాయకులు ఎంవీఆర్ నాయుడు, దాడి శ్రీను, గ్రామ శాఖ అధ్యక్షుడు దాడి గంగాజీ, నాయకులు దాడి జగన్నాధరావు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.అమ్మవారి పండుగను ఘనంగా నిర్వహిస్తున్న గ్రామ పెద్దలను మరియు కమిటీ సభ్యులను కర్రి సాయికృష్ణ అభినందించారు
Breaking News

Subscribe our Newsletter