భక్తిశ్రద్ధలతో హనుమాన్ విగ్రహావిష్కరణ: గంటవానిపాలెంలో ఆధ్యాత్మిక సందడి
20/April/2026 21:20
Share:
మునగపాక: యలమంచిలి నియోజకవర్గం, మునగపాక మండలం గంటవానిపాలెం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా జరిగింది.ఈ పవిత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ గొంతిన వెంకట హరీష్ పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు జరగడం వల్ల అందరికీ శుభం చేకూరుతుందని, స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మునగపాక మండల పార్టీ అధ్యక్షులు పెంటకోట విజయ్,రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ భీమరశెట్టి శ్రీనివాసరావు, క్లస్టర్ ఇంచార్జ్ సేనాపతి శేషు, మాజీ సర్పంచ్ అరగ శ్రీనివాస్, కర్రీ కేశవ మరియు ఇతర ముఖ్య నేతలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు విగ్రహావిష్కరణ అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం జరిగింది. ఈ వేడుకను చూసేందుకు గ్రామస్తులు మరియు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో గంటవానిపాలెం గ్రామం హనుమాన్ నామస్మరణతో మారుమోగింది.