గాజువాకలో స్వయంభు వెంకటేశ్వర ఆలయ నిర్మాణం వెనుక కథ..

గాజువాకలో స్వయంభు వెంకటేశ్వర ఆలయ నిర్మాణం వెనుక కథ..

20/September/2026 10:06    Share:   

గాజువాక పారిశ్రామిక ప్రాంతానికి ఆధ్యాత్మిక మణిహారం అవుతున్న వాంబే కాలనీలో వెలసిన స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల మనసుల్లో నిలిచిపోతుంది.

కలలో దర్శనం – గాజువాక వెంకటేశ్వర ఆలయ ఆవిర్భావం

గాజువాక వాంబే కాలనీలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవిర్భావం వెనుక విశేషమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆలయ ధర్మకర్త మంజుల గారు వెల్లడించిన వివరాల ప్రకారం, ఒకరోజు ఆమెకు కలలో స్వామి ప్రత్యక్షమై “ఏడు ఊర్లు తిరిగి జోగి దండమని” అని సూచించారు. మరుసటి రోజు ఆమె ఆ నియమాన్ని పాటించి, భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణానికి పునాదులు వేసారు.

రాతి విగ్రహ స్థాపన
రాతి విగ్రహాన్ని స్థాపించి దండ వేయాలనితెలిపారు. అదే సమయంలో కాలనీలో నివసిస్తున్న ఒక క్రైస్తవ మహిళకు కూడా స్వామి ఆవహించి, ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించారని సమాచారం.

అవమానాలు – అడ్డంకులు
ఈ విషయాన్ని నమ్మని కొంతమంది వెటకారాలు చేసి మంజులను అవమానించారు. అయితే స్థానిక నాయకుడు దొడ్డి రమణ ఈ విషయాన్ని గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావుతో చర్చించి భూమి పూజ నిర్వహించారు.

హోమగుండం – తులసి వనం
ఆలయ నిర్మాణానికి ముందు నిర్వహించిన హోమం అనంతరం ఆ ప్రాంతంలో హోమగుండం వద్ద లక్ష్మీ తులసి, విష్ణు తులసి చెట్లు పెరిగి పెద్ద వనంలా మారాయి. చుట్టూ పచ్చదనం అలరారుతూ కన్నుల విందుగా తయారైంది.

భక్తిశ్రద్ధలతో అభివృద్ధి
అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదురైనా, మంజుల గారు శ్రీ వెంకటేశ్వర స్వామిపై నమ్మకంతో ముందుకు సాగుతూ ఆలయ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ గాజువాక ప్రజలకు ఆధ్యాత్మిక శాంతి, భక్తి వాతావరణాన్ని అందిస్తోంది.


సేవా సంఘం – అన్నదాన కార్యక్రమం
భక్తులు ఒక సేవా సంఘం ఏర్పాటు చేసి, ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ప్రారంభించారు.

భక్తుల కోరికలు తీర్చే స్వామి
భక్తుల కోరికలు నెరవేరుతుండడంతో, స్వామివారు కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామిగా పేరుపొందారు.
 


Breaking News

Subscribe our Newsletter