ములకలాపల్లి (యలమంచిలి):
అనకాపల్లి జిల్లా, యలమంచిలి మండలం ములకలాపల్లి గ్రామంలోని మైహోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (సిమెంట్ ఫ్యాక్టరీ) ప్రాంగణంలో వెలసిన శ్రీనగర్ కాలనీ శ్రీ వ్యూహ లక్ష్మీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ భూ సమేత శ్రీ శ్రీనివాస స్వామి వారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
చినజీయర్ స్వామి పర్యవేక్షణలో కళ్యాణం:బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆదివారం (తేది 12.04.2026) ఉదయం 10.00 గంటలకు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. పరమ పూజ్యశ్రీ శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ఈ కళ్యాణ వేడుక జరిగింది. భక్తుల గోవింద నామస్మరణతో ఫ్యాక్టరీ పరిసరాలు మార్మోగాయి.ఈ పవిత్ర కార్యక్రమంలో మైహోమ్ గ్రూప్ అధినేత శ్రీ జూపల్లి రామేశ్వరరావు - శ్రీమతి కుమారి దంపతులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు మైహోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ శ్రీ జూపల్లి వినోద్ బాబు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జూపల్లి రంజిత్ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ సి.ఎస్. పాండ్, ప్రముఖ నాయకులు పప్పల చలపతి రావు, పగడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ఈ వేడుకకు పరిసర గ్రామాల సర్పంచ్‌లు, గ్రామ నాయకులు, మైహోమ్ కాలనీ వాసులు, ఫ్యాక్టరీ ఉద్యోగులు మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మైహోమ్ యాజమాన్యం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయని ఫ్యాక్టరీ యూనిట్ హెడ్ శ్రీ బి.రామస్వామి గారు ఈ సందర్భంగా తెలియజేశారు.