పెద్ద గొల్లల పాలెం గ్రామంలో ఘనంగా శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

పెద్ద గొల్లల పాలెం గ్రామంలో ఘనంగా శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

06/March/2026 20:38    Share:   

- భక్తులను ఆకట్టుకున్న ఆజ్ఞాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు
యలమంచిలి : మున్సిపాలిటీ పరిధిలో గల పెద్ద గొల్లల పాలెం గ్రామంలో శ్రీ కృష్ణభగవానుని స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఉదయం నుంచి వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి శుభ మహూర్తాన శ్రీకృష్ణుడు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తుల ఆరాధ్యదైవమైన శ్రీ కృష్ణభగవానుడిని స్థానికులే కాకుండా సమీప గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో దర్శించి పూజలు చేశారు. తమ మొక్కులు చెల్లించుక ఉన్నారు. స్వామివారిని దర్శించేందుకు భక్తులు గుడివద్ద గుమ్మికూడారు. పలువురు నాయకులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. మధ్యాహ్నం స్వామివారి ఆలయం ప్రాంగణంలో భారీ అన్నస మారాధన కార్యక్రమంను నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి ఆలయం ఆవరణలో నిర్వహించి పలు ఆజ్ఞాత్మిక, సాంస్కుృతిక కార్యక్రమాలు, విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Breaking News

Subscribe our Newsletter