
రాంబిల్లి: గురు పౌర్ణమి మహా పర్వదినం సందర్భంగా రాంబిల్లి మండలం కొత్తూరు గ్రామంలో శ్రీ దుర్గా సహిత శ్రీ శ్రీ శ్రీ అమ్ముల పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో ఎలమంచిలి వేద పాఠశాల ఆధ్వర్యంలో దుర్గా దేవి హోమం నిర్వహించారు.ఈ ప్రత్యేక కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారు, వారి సోదరులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాలుపంచుకున్నారు.