
విశాఖపట్నం,శ్రీ మాతాజీ నిర్మలాదేవి దివ్య ఆశీస్సులతో జూన్ 5, 6, 7 తేదీల్లో మూడు రోజులపాటు జాతీయ శ్రీ ఆదిశక్తి పూజ, సెమినార్-2026 విశాఖలో నిర్వహించనున్నట్లు నేషనల్ ట్రస్ట్ జాతీయ జాయింట్ సెక్రటరీ జగదీష్ మొహత తెలిపారు.
సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం సహజ యోగ ఫౌండర్ ప్రతినిధులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ విదేశాల నుండి 5000 మంది ప్రతినిధులు ఈ మహోత్సవానికి హాజరవుతారని వెల్లడించారు.
జూన్ 5, 6 తేదీల్లో జరిగే ప్రధాన కార్యక్రమాల అనంతరం జూన్ 7న సాయంత్రం 6 గంటలకు విశాఖ బీచ్ రోడ్ గాదిరాజు ప్యాలెస్‌లో ప్రజల కోసం ఉచిత సహజ యోగా ధ్యాన పరిచయ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
1970 మే 5న శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజ యోగాన్ని స్థాపించారని, ఈ యోగం ద్వారా ధ్యానం ప్రాముఖ్యత, బ్యాలెన్సింగ్ స్టేట్, ట్రెస్ ఫ్రీ జీవనం లభిస్తుందని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు ఇది ఉపయోగకరమని, ముఖ్యంగా చిన్నపిల్లల మేధాశక్తి పెరుగుతుందని చెప్పారు.
ఆత్మసాక్షాత్కారం జ్ఞానం ద్వారా లభిస్తుందని, పంచభూతాల శక్తిని జ్ఞానం ద్వారా అదుపు చేయవచ్చని, అంతర్గత శాంతి సాధించినప్పుడే ప్రపంచ శాంతి సిద్ధిస్తుందని జగదీష్ మెహతా పేర్కొన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ రామకృష్ణ, సహజ యోగ నేషనల్ ట్రస్ట్ మెంబర్స్ మధుసూదనరావు, హరిప్రసాద్ బియని (స్టేట్ అగ్రికల్చర్ కోఆర్డినేటర్), కెప్టెన్ బాబూరావు, గజేంద్ర, రమేష్, మీనాక్షి, నవీన్ (చెన్నై), ఏపీ స్టేట్ మెంబర్ పద్మావతి సింహాద్రి, శ్రీరామ్ మూర్తి, యువశక్తి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.