విశాఖపట్నం (బురుజుపేట): స్థానిక బురుజుపేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల కోసం ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.వైదిక కమిటీ వారి సూచనల మేరకు, అమ్మవారి సన్నిధిలో "సుగంధ జల కలశాభిషేకం" నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆలయ ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి (E.O.) కె. శోభారాణి గారు ఒక ప్రకటనలో తెలిపారు కార్యక్రమ వివరాలు 20-04-2026 (అక్షయ తృతీయ రోజున) సమయం: ఉదయం 6:00 గంటల నుండి ప్రారంభం.దర్శన రుసుము: రూ. 200/- దర్శన టికెట్ తీసుకున్న భక్తులకు ఈ అవకాశం కల్పించబడుతుంది.టికెట్ తీసుకున్న భక్తుల పేరు, గోత్రాలను అమ్మవారి సన్నిధిలో చదివి, వారి పేరిట సుగంధ జల కలశాభిషేకం నిర్వహించబడుతుంది.ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరియు అమ్మవారి కృపకు పాత్రులు కావాలని భక్తులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.