అనకాపల్లి: శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ ఉషా ఛాయా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న శ్రావణమాస మహోత్సవాల ఆహ్వాన పత్రికను మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ కొణతాల రామకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ ఏడాది నుంచి ఈశాన్యంలో ఉన్న రమాదేవి అమ్మవారికి శ్రావణమాస మహోత్సవాల సందర్భంగా ఐదు వారాల పాటు సామూహిక పంచఫల కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కుంకుమ పూజలు, అనంతరం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.ఆగస్టు 14న దానిమ్మ, ఆగస్టు 21న జామ, ఆగస్టు 28న ఆపిల్, సెప్టెంబర్ 4న కమలా పండ్లు, సెప్టెంబర్ 11న ద్రాక్ష పండ్లతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఐదు వారాల పూజలు పూర్తి చేసిన భక్తులకు మూలవిరాట్ వద్ద పూజలు చేసిన రక్ష అందజేయనున్నట్లు తెలిపారు. భక్తులందరూ ఈ పవిత్రమైన శ్రావణమాస మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బొడ్డేడ మురళి, ధర్మకర్తలు సూరిశెట్టి మల్లమ్మ, దొడ్డి భరత్, కర్రీ లక్ష్మీ, నూకరాజు, రేబాక వరలక్ష్మి, ఈశ్వర అప్పారావు, తమ్మిరాజు మల్లికార్జునరావు, మారిశెట్టి అరుణ, భాస్కరరావు, తురకలపూడి ఈశ్వరరావు, కైచర్ల నరసయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. క్రైమ్ ఎనాలసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ అప్పికొండ