దెందులూరు "రైతన్న మీకోసం" కార్యక్రమం విజయవంతం చేద్దాం
16/March/2026 21:26
Share:
దెందులూరు ,మార్చి 16 (ca news)Sudheer ddl రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసి తోడ్పాటును అందిస్తుందని, సంక్షేమ పథకాలు రైతులకు పూర్తిస్థాయిలో అందేలా చేయడమే రైతన్న మీకోసం వారోత్సవాల ప్రధాన లక్షమని ఏలూరు డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అనీల కుమారి అన్నారు. రైతన్న మీకోసం వారోత్సవాల్లో భాగంగా దెందులూరు మండలం కొవ్వలి, పోతునూరు, ఉండ్రాజవరంలో ఏవో శ్రీనివాస్ తో కలిసి సోమవారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో రైతులను కలిసి రైతన్న మీకోసం కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వ్యవసాయ, ఉద్యాన ,పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్లు, సచివాలయ అధికారులు, గ్రామ అభ్యుదయ రైతు సహకార సంఘం సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులతో గ్రామ కమిటీగా మూడు టీములుగా ఏర్పడుతాయి అన్నారు. ఒక్కొక్క టీం కలిసి రోజు 30 మంది రైతుల ఇళ్లకు వెళ్లి నీటి భద్రత, డిమాండ్, ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.