ఆటో మరియు ఇతర వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
16/March/2026 19:53
Share:
అనకాపల్లి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తుహిన్ సిన్హా, అనకాపల్లి సబ్ డివిజన్ M శ్రావణి మేడం వారి ఆదేశాలు మేరకు, అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం. వెంకట నారాయణ గారు మరియు SIs అనకాపల్లి పట్టణ పరిధిలోని శారద బ్రిడ్జ్ వద్ద వాహనదారులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోటార్ సైకిల్, ఆటో మరియు ఇతర వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మోటార్ సైకిల్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, అలాంటి వారికి రూ.10,000 జరిమానా లేదా జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదని, ప్రతి వాహనానికి తప్పనిసరిగా నెంబర్ ప్లేట్ ఉండాలని చెప్పారు. నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలపకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అదే విధంగా తేదీ.14-03-2026 న జరిగిన లోక్ అదాలత్ లో Hon'ble IInd Class Megistrate కోర్టు వారు 225 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు లో Rs.22,50,000/- జరీమాన వేసి ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు లో పట్టుబడి చాలా కాలం నుండి కోర్టుహాజరు కాకుండా జరీమాన కట్టని వారు త్వరిత గతిన హాజరు కావాలిసింది గా తెలియజేసయడం జరిగింది.