యలమంచిలి: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు యలమంచిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షులు రాజాన సూర్య చంద్ర శేషగిరి రావు (శేషు) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి యలమంచిలి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఈ. సందీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అదే ప్రాంగణంలో ముఖ్యమంత్రి ప్రసంగాన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రదర్శించారు. మండల తహసీల్దార్ వరహాల రావు, మున్సిపల్ కమిషనర్, బి.జే.ఎస్. ప్రసాద్, మండల విద్యా అధికారి సూర్య ప్రకాష్, ఇతర మండల స్థాయి అధికారులు, మండల పరిషత్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఎం.పి.డి.ఓ.కె.ఎస్. కొండలరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ లోవ కుమారి, పిఎసిఎస్ చైర్మన్ గోపీ, జనసేన పార్టీ నాయకులు సోమునాయుడు తదితరులు పాల్గొన్నారు.