ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ యలమంచిలి : రోడ్డు ప్రమాదాల నివారణకు తప్పనిసరిగా రహదారి నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ సూచించారు. జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు సందర్భంగా యలమంచిలి పట్టణంలో వాహనచోదకులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. పరిమిత వేగంతో వాహనాలు నడపాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.