#మార్చి 14 వ తేదీన ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..* కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు జెండా ఆవిష్కరణ అనంతరం పార్టీ కార్యాలయం వద్ద నుండి భారీ బైక్ ర్యాలీ.. అనంతరం మర్చంట్ ఛాంబర్ హాలు నందు ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం..పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రెడ్డి అప్పల నాయుడు గారు.. ఏలూరు,మార్చి 13:- జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు గారి సూచనలతో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల జనసేన ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహించనున్నామని ఏలూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 14వ తేదీన అనగా రేపు ఉదయం 9:00 గంటలకు ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ, అనంతరం పార్టీ కార్యాలయం భారీ బైక్ ర్యాలీ. ఈ ర్యాలీ ఏలూరు జనసేన కార్యాలయం వద్ద నుండి ప్రారంభం కానున్నాయి. పవర్ పేట, ఆర్ఆర్ పేట, ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్, మెయిన్ బజార్, గడియార స్తంభం మీదుగా ర్యాలీగా బయలుదేరి కస్తూరిబాయి స్కూల్ సమీపంలో ఉన్న మర్చంట్ చాంబర్ కళ్యాణ మండపం వద్దకు చేరుకుంటామని, అక్కడి తో ర్యాలీ ముగుస్తుంది. అనంతరం ఆ కళ్యాణమండపంలో భారీ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. జనసేన పార్టీ అధిష్టానం మేరకు ఈ కార్యక్రమాన్ని ఏలూరు, దెందులూరు జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణాలు, కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్ని విషయాలను చర్చించనున్నామన్నారు. కావున ఈ కార్యక్రమానికి ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు..