రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ దుర్మరణం: మరొకరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ దుర్మరణం: మరొకరికి తీవ్ర గాయాలు

21/May/2026 20:30    Share:   

యలమంచిలి:
యలమంచిలి మండలం మర్రిబంద జంక్షన్ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం. అనకాపల్లి వైపు నుండి తుని వైపు వెళ్తున్న AP 39 RG 5250 నెంబర్ గల కారు టైర్ ఒక్కసారిగా పంక్చర్. దాంతో కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డు ప్రక్కకు దూసుకెళ్లి పలు పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కారులో ప్రయాణిస్తున్న మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మృతుడు కాకినాడ జిల్లా, U. కొత్తపల్లి మండలం, నాగులపల్లి గ్రామానికి చెందిన పెనుమళ్లు వెంకట నాగ బుల్లి ప్రసాద్ రెడ్డి (30) గా గుర్తించారు. ఆయన తండ్రి పేరు వీర వెంకట రమణ రెడ్డి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 
Breaking News

Subscribe our Newsletter