స్పీకర్ అయ్యన్న గారితో కలిసి కల్యాణపులోవలో మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ

స్పీకర్ అయ్యన్న గారితో కలిసి కల్యాణపులోవలో మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ

16/February/2026 08:09    Share:   

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రావికమతం మండలంలోని భీమలపాడు పంచాయతీ శివారు కల్యాణపులోవలో నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభాధిపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు,రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సి.ఎం రమేష్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.కార్యక్రమం లో చోడవరం శాసనసభ్యులు కే.ఎస్.ఎన్.ఎస్ రాజు,అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షులు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు గారు,డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ గారు స్థానిక ప్రజాప్రతినిధులు,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.ముందుగా రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన స్నానఘట్టానికి ప్రజా ప్రతినిధులు చేరుకుని గంగమ్మ వారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.అనంతరం కల్యాణపులోవలో కొలువుదీరిన పోతురాజుబాబు పెద్దింటమ్మ వారిని దర్శించుకున్నారు.తదనంతరం శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించిన అనంతరం వేలాదిమంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా వడ్డించారు.ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు,ఎంపీ సి.ఎం రమేష్ గారు భక్తులకు అభివాదం చేస్తూ ప్రత్యేకంగా మహిళలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.ఆధ్యాత్మికతతో సమాజంలో ఐక్యత శాంతి నెలకొనాలని ఈ సందర్బంగా నాయకులు ఆకాంక్షించారు.
Breaking News

Subscribe our Newsletter