ఏలూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయ,జిల్లా జాయింట్ కలెక్టర్  ఎం. జె. అభిషేక్ గౌడ .

ఏలూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయ,జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ .

27/April/2026 06:44    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ,ఏలూరు,
ఏలూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్  ఎం. జె. అభిషేక్ గౌడ  స్పష్టం చేశారు. జిల్లాలో డీజిల్ కొరతపై వస్తున్న వదంతులపై జెసి తన క్యాంపు కార్యాలయంలో పాత్రికేయల  సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు అవసరమైన మేరకు ఇంధన సరఫరా నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో డీజిల్ కొరతపై వస్తున్న ప్రచారం నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు లోనవుతూ పెట్రోల్ బంకుల వద్ద అధిక సంఖ్యలో చేరుతున్నారని  పేర్కొన్నారు. అవసరం లేకపోయినా  డీజిల్‌ను నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల అనవసర రద్దీ ఏర్పడుతోందని చెప్పారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా, సాధారణ అవసరాలకు మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని జేసి సూచించారు. పెట్రోల్ బంకుల్లో సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు.   ఇంధన కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని  విజ్ఞప్తి చేశారు.  జిల్లా లో 232 పెట్రోల్ బంకులలో పెట్రోలు, డిజిల్స్ కు సంబందించి ఎలాంటి ఇబ్బంది లేదని, వదంతులు నమ్మి కొరత ప్రజలు అధికంగా కొనుగోలు చేయడం కారణంగా శనివారం 28 బంకులలో కొంతమేర డీజిల్ కొరత ఏర్పడిందని, ఈరోజు ఆదివారం అయినాప్పటికీ పెట్రోల్ కంపెనీల వారితో మాట్లాడి, సదరు బంకులలో కూడా  ఈరోజు సాయంత్రం, రేపు ఉదయం లోగా పూర్తిస్థాయిలో డీజిల్ అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  . జిల్లా ఎక్కడైనా సమస్యలు ఉంటే ఆయిల్ కంపెనీ వారిని సంప్రదించి స్టాక్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.  కొంతమంది రైతుల పేరుతో  క్యానులు, డ్రమ్ములలో డీజిల్ కొనుగోలు చేస్తున్నారని, అటువంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.   రబీలో ధాన్యం కొనుగోలు సంబంధించి రవాణా చేసే వాహనాలకు ఇటువంటి డీజిల్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ధాన్యం లారీలకు డీజిల్ సమస్య ఉంటే వెంటనే సంబంధిత తహసీల్దార్ దృష్టికి తీసుకువస్తే, టోకెన్ అందించి దగ్గరలోని బంక్ లలో డీజిల్ అందిస్తున్నమన్నారు. అదే విధంగా ఆక్వా కల్చర్కు సంబంధించి డీజిల్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నమన్నారు. డీజిల్ వినియోగం పెరిగిన కారణంగా  గతవారం కన్నా ఈ వారం 10% ఎక్కువగా డీజిల్ ను బంకులలో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. రూ.1000,1500/- వినియోగించే కార్ల యజమానులు  సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న అవాస్తవాలకు ఆందోళనతో కూడా ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారన్నారు.సోషల్ మీడియాలో అవాస్తవాలు వ్యాపింప చేసే వారి పై కేసులు నమోదు-జేసి    జిల్లాలో పెట్రోలు డీజిలు కొరత ఏర్పడనున్నదని  అవాస్తవాలను సోషల్ మీడియా ద్వారా వ్యాపింపజేసి, ప్రజలను ఆందోళనకు గురి చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ అభిషేక గౌడ హెచ్చరించారు.
Breaking News

Subscribe our Newsletter