వేసవిలో విద్యుత్ డిమాండ్‌కు ప్రత్యేక ప్రణాళిక వేసవిలో విద్యుత్ డిమాండ్‌కు ప్రత్యేక ప్రణాళిక..!!
28/May/2026 08:16
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్ ఏలూరు, :
ప్రస్తుత వేసవి లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని , ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్, ఏలూరు పర్యవేక్షక ఇంజనీర్ పి. సాల్మన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లాలోని అన్ని మండలాల్లో రానున్న ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు 41 నుండి 50 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసిల్వి మరియు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృద్వీలేజ్ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయి అప్రమత్తతతో విధులు నిర్వహిస్తున్నారన్నారు.వేసవి తీవ్రత,వడగాల్పుల ప్రభావం దృష్ట్యా వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నిరంతరాయంగా మరియు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చేపట్టిన ముఖ్యమైన చర్యలుతెలియజేస్తూ అధిక విద్యుత్ లోడ్ నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి అదనపు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు (DTRలు) ఏర్పాటు చేయడం జరిగిందని, ఓవర్ లోడ్ కు గురవుతున్న పాత ట్రాన్స్ పార్కర్ల సామర్థ్యాన్ని పెంచి విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గరిష్ట విద్యుత్ వినియోగ సమయాల్లో (Peak Load llours) తలెత్త సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సర్కిల్ పరిధిలోని 19 మండలాల్లో ప్రతి మండలానికి మూడు చొప్పున ప్రత్యేక అత్యవసర బృందాలు (Emergency Barches) ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యుత్ సరఫరా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించబడ్డాయని, వీరు షిఫ్ట్ ల వారిగా పనిచేస్తూ లోడ్ హెచ్చుతగ్గులను గమనించి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రతి డివిజన్ పరిధిలో తగినన్ని రోలింగ్ స్టాక్ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనందుకు జిల్లా వ్యాప్తంగా సుమారు 400 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు (DTRలు) స్టాక్ అందుబాటులో ఉంచడం జరిగిందని, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి విద్యుత్ అంతరాలయలకు సంబందించిన ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
వినియోగదారులు విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైన వెంటనే క్రింది నంబర్లకు సమాచారం అందించాలని కోరారు:
పర్యవేక్షక ఇంజనీర్, ఏలూరు: 9440812702మ,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జంగారెడ్డిగూడెం: 9491049797,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏలూరు: 9440812704,విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912,
లోడ్ మోనిటరింగ్ సెల్స్ :బంగారెడ్డిగూడెం డివిజన్ : 9491030712,ఏలూరు డివిజన్: 9440904037.* ఏలూరు సర్కిల్ : 9440902926
సమాచారం అందిన వెంటనే సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారని తెలిపారు.వేసవి కాలంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణాలు, గ్రామాల్లో అవసరమైన ప్రాంతాల్లో అదనపు ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయడం, లోడ్ బ్యాలెన్సింగ్ చర్యలు చేపట్టడం జరుగుతోందని, వినియోగదారులకు నాణ్యమైన మరియు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని సాల్మన్ రాజు తెలియజేసారు.