జనరల్ ఇన్సూరెన్స్ (PGI) కింద మంజూరైన ₹11,40,000 బీమా చెక్కును అంద చేసిన ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్,

జనరల్ ఇన్సూరెన్స్ (PGI) కింద మంజూరైన ₹11,40,000 బీమా చెక్కును అంద చేసిన ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్,

06/May/2026 20:41    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు 
ఏలూరు జిల్లా హోంగార్డు యూనిట్‌ లో విధులు నిర్వహిస్తూ, దుర దృష్టవశాత్తు ప్రమా దవశాత్తు మరణిం చిన హోంగార్డు (HG 574) ఎం. వీరబాబు గారి కుటుంబానికి జిల్లా పోలీసు యం త్రాంగం అండగా నిలిచింది.హోమ్ గార్డ్ యూనిట్ ఫ్లాగ్ ఫండ్ 10,000/- రూ లు, ఫ్యూనరల్ ఛార్జ్ 10,000 రూపాయలు ప్రభుత్వ జనరల్ ఇన్సూరెన్స్ (PGI) కింద మంజూరైన ₹11,40,000 పదకొండు లక్షల నలభై వేల రూపాయల బీమా చెక్కును ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాల యంలో ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ వీరబాబు గారి భార్య రామ లక్ష్మీ దేవి గారికి అంద చేసినారు.
యాక్సిస్ బ్యాంక్ ఇన్సూరెన్స్ ద్వారా రాబడిన 30 లక్షల రూపాయల చెక్కును జిల్లా ఎస్పీ గారు వీరబాబు గారి భార్య రామ లక్ష్మీ దేవి గారికి అంద చేసినారు బీమా చెక్కును అందజేసిన అనంతరం జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఎం.వీరబాబు గారు విధుల పట్ల ఎంతో అంకిత భావం,క్రమశిక్షణ కలిగిన వ్యక్తని కొనియాడారు.ది 19.01.2026 న ఆయన మరణించడం ఏలూరు జిల్లా హోం గార్డు విభాగానికి తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.హోంగార్డు వ్యవస్థ లో వీరబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయమని, వారి కుటుంబానికి ఏలూరు జిల్లా పోలీసు శాఖ మరియు హోంగార్డు వ్యవస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ గారు హామీ ఇచ్చారు. బీమా సొమ్ము వారి కుటుంబానికి ఆర్థిక ఊరట నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబానికి బీమా సొమ్ము త్వరగా అందేలా కృషి చేసిన యాక్సెస్ బ్యాంక్  అధికారులు యాక్సిస్ బ్యాంక్ క్లస్టర్ ఇంచార్జ్ ఏ రవిచంద్ర గారు ఏలూరు బ్రాంచ్ మేనేజర్ కే అనిల్ గారు కోపరేటివ్ శాలరీ మేనేజర్  డి సురేష్ గారు లను ఎస్పీ అభినందించారు.
పోలీసు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సిబ్బంది భద్రతకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ బి-సెక్షన్ సూపరిం టెండెంట్ శ్రీ పి. నాగేశ్వర రావు గారు, పోలీస్ కార్యాలయ సిబ్బంది మరియు హోంగార్డు విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter