రోడ్డు ప్రమాదాలపై అవగాహనకు భారీ బైక్ ర్యాలీ,ప్రజల్లో చైతన్యం నిపిన మంత్రి అనిత..

రోడ్డు ప్రమాదాలపై అవగాహనకు భారీ బైక్ ర్యాలీ,ప్రజల్లో చైతన్యం నిపిన మంత్రి అనిత..

06/May/2026 20:23    Share:   

క్రైo అనాలసిస్  రిపోర్టర్ ఆనంద్
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో రాష్ట్ర హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రారంభమైన ఈ ర్యాలీలో యువత, మహిళలు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ,“ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయి. యువత బాధ్యతగా డ్రైవింగ్ చేయాలి” అని తెలిపారు.ర్యాలీ సందర్భంగా ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ రోడ్డు భద్రతపై సందేశాలు ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter