ఏలూరు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి – గోదావరి జలాల బృహత్ ప్రణాళిక త్వరలో ప్రారంభం..

ఏలూరు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి – గోదావరి జలాల బృహత్ ప్రణాళిక త్వరలో ప్రారంభం..

06/May/2026 06:52    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
ప్రజలంతా ముక్తకంఠంతో, ఏకపక్షం వహించి గెలిపించుకున్న కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ప్రజల ఆకాంక్షలను గెలిపించేందుకు అనునిత్యం శ్రమిస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపేందుకు అభివృద్ధి పనుల్లో వారిని బాగస్వాములను చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏలూరు నగర ప్రజలందరికీ 138కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గోదావరి జలాలను సమృద్దిగా అందించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని, త్వరలోనే ఈ బృహత్‌ ప్రణాళిక పనులు ప్రారంభం కానున్నాయని ఆయన ప్రకటించారు. ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ 15వ ఆర్ధిక సంఘం నిధులు 37లక్షల రూపాయలతో స్థానిక 27వ డివిజన్‌ కండ్రికగూడెం సెంటర్‌ బాలాజీ నగర్‌లో నిర్మించిన సిసి రోడ్డు, డ్రైనేజి, 28వ డివిజన్‌ బిడి కాలనీలో నిర్మించిన సిసి రోడ్డును ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో ముచ్చటించిన ఆయన కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై వారి మనోగతాలను తెలుసుకున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతాక్రమంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తిచేస్తున్నట్లు వారికి వివరించారు. ఇంకేమైనా సమస్యలున్నాయా అంటూ వారిని ప్రశ్నించి వారి వద్ద నుంచి సమాచారం తీసుకున్నారు. ఒక్కొక్కటిగా అన్ని పనులు పూర్తి చేయడం జరుగుతుందని, ప్రజలు తమ కళ్ళ ఎదుట జరుగుతున్న అభివృద్ధిని కూడా మిగిలిన వారితో పంచుకుని కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతివ్వాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే బడేటి చంటిని అభినందిస్తూ సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో ప్రాధాన్యతాక్రమంలో అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామన్నారు. తొలి ప్రాధాన్యత రోడ్ల నిర్మాణానికి కేటాయించి ఆ దిశగా అనేక ప్రాంతాల్లోని రహదారులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామన్న ఆయన,,, అదేబాటలో కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లతో సిసి డ్రైన్ల నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టామన్నారు. భవిష్యత్తు అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్న ఆయన,,, రానున్న రోజుల్లో నీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు 138 కోట్ల రూపాయల నిధులతో గోదావరి జలాలను సమృద్దిగా అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. నాలుగు ప్రాంతాల్లో అందుకు అవసరమైన ట్యాంకుల నిర్మాణాలను ఏడాదిన్నర కాలంలో పూర్తిచేసేలా పటిష్ట ప్రణాళికలు అమలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజలను కూడా పూర్తిస్థాయిలో భాగస్వాములను చేస్తూ వారితోనే పూర్తైన పనులకు ప్రారంభోత్సవాలు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. వాస్తవాలను అర్దం చేసుకుని, తమ కళ్ళెదుట జరుగుతున్న అభివృద్ధిని అంచనా వేసుకుంటూ ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాలల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దాసరి ఆంజనేయులు, ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఎఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటి మేయర్‌ కర్రి శ్రీనివాసరావు, కో- ఆప్షన్‌ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్సెమ్మార్‌ పెదబాబు, కార్పొరేటర్‌ తంగిరాల అరుణ, క్లస్టర్ కో ఇన్ఛార్జ్ ఆర్నేపల్లి తిరుపతి 27వ డివిజన్‌ ఇన్‌ఛార్జి యడ్లపల్లి శివ, కో ఇంచార్జ్ బోడెం వెంకట్రావు, 28, డివిజన్ కో ఇన్చార్జ్ మహమ్మద్ ఖాజా, శనివారం పేట సహకార బ్యాంకు చైర్మన్ కోనేరు వంశీకృష్ణ, ఏలూరు అగ్రికల్చర్ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అమరావతి అశోక్, పార్టీ నాయకులు బెజ్జం అచ్చయమ్మ తంగిరాల సురేష్‌, లంకపల్లి మాణిక్యాలరావు, కందుల రమేష్‌, తదితరులు పాల్గొన్నారు...
Breaking News

Subscribe our Newsletter