రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ దుర్మరణం !

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ దుర్మరణం !

05/May/2026 20:00    Share:   

ఎలమంచిలి (రూరల్): మండల పరిధిలోని పులపర్తి జంక్షన్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పాయకరావుపేట మండలం వి.కొత్తూరు గ్రామానికి చెందిన పులగల సుబ్రమణ్యం (32), తండ్రి లేట్ నాగేశ్వరరావు, గత ఆరేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తేదీ 04.05.2026 రాత్రి వైజాగ్ పోర్ట్ నుండి AP 05 TG 3288 నంబర్ గల లారీలో బొగ్గు లోడుతో క్లీనర్ విజ్జెన శ్యామ్‌తో కలిసి హైదరాబాద్‌కు బయలుదేరాడు.
మార్గమధ్యంలో ఎలమంచిలి మండలం పులపర్తి జంక్షన్ దాటిన తర్వాత,నిర్మాణంలో ఉన్న నయారా బంకు వద్ద రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో సుబ్రమణ్యం లారీని ఆపాడు.లారీ కుడివైపు చక్రాలకు గాలిని తనిఖీ చేస్తుండగా,అనకాపల్లి వైపు నుండి తుని వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం అతడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్రమణ్యం తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మృతుని బావ గారా సంజీవరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎలమంచిలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు విచారణ చేపడుతున్నారు
Breaking News

Subscribe our Newsletter