విశాఖపట్నం రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారుల సమగ్ర సమీక్షా సమావేశం..

విశాఖపట్నం రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారుల సమగ్ర సమీక్షా సమావేశం..

06/June/2026 21:24    Share:   

విశాఖపట్నం,జూన్ 06: విశాఖ రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మరింత పారదర్శకమైన, వేగవంతమైన పోలీస్ సేవలను అందించడమే ధ్యేయంగా విశాఖ ఐజిపి శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ తన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ వర్చువల్ సమావేశంలో రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల ఎస్పీలు శ్రీ అమిత్ బర్దర్, శ్రీ తుహిన్ సిన్హా, శ్రీ దామోదర్, శ్రీ మహేశ్వర్ రెడ్డి, శ్రీ మాధవరెడ్డి, సబ్ డివిజన్ అధికారులు మరియు స్టేషన్ హౌస్ అధికారులు  పాల్గొన్నారు.

1. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత: 
మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. మహిళల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
2. దీర్ఘకాలిక కేసుల పరిష్కారం: 
31.12.2023 కంటే ముందు నమోదై, ఇప్పటికీ దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కేసుల ఆలస్యానికి గల కారణాలను విశ్లేషించి, వాటిని త్వరితగతిన ముగించాలని సూచించారు.
3. సైబర్ నేరాలపై ఉక్కుపాదం: 
ఒక కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లిన పెద్ద సైబర్ మోసాలు మరియు 'డిజిటల్ అరెస్ట్' కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం హోల్డ్ చేసిన సొమ్మును బాధితులకు సకాలంలో రీఫండ్  చేయించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో పెండింగ్‌లో ఉన్న ₹10 లక్షలు మరియు అంతకంటే ఎక్కువ విలువైన పిటిషన్లపై కేసులను నమోదుచేసి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సైబర్ మోశాలలో భాదితులు పోగొట్టుకొని ఫ్రీజ్ అయిన డబ్బులను ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పైలట్ ప్రాజెక్టు క్రింద అమలు చేస్తున్న “Money restoration management” సిస్టమ్ ద్వారా కోర్టు ఆర్డర్ లేకుండానే అప్పగించుటకు చర్యలు తీసుకొమ్మని ఆదేశించారు.  
సైబర్ మోశాలకు సంబందించి డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ నిలుపుదల మొదలగు పిర్యాదులను నూతనంగా ప్రవేశపెట్టిన  “Grievance Redressal module” సిస్టమ్ ద్వారా పరిస్కరించమని ఆదేశాలు యిచ్చినారు.
 
4. సోషల్ మీడియా నేరాల అదుపు: 
సోషల్ మీడియా ద్వారా సమాజంలో అశాంతి రేకెత్తించేలా ప్రవర్తించే వారిపై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వివాదాస్పద కేసులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. Repeated నేరస్థులను గుర్తించి, వారిపై హిస్టరీ షీట్లు తెరవాలని స్పష్టం చేశారు.
5. గంజాయి, మత్తుపదార్థాల నిర్మూలన (NDPS - Sankalpam 2.0): 
అక్రమ గంజాయి రవాణా వ్యాపారం చేసే 15 మంది నేరస్తులకి చెందిన Rs: 9,45,10,321/-రూపాయల ఆస్తులు స్వాధీనం చేసుకోవడం జరిగినది. గంజాయి అక్రమ రవాణాలో పాల్గొంటున్న వ్యక్తుల ఆస్తులను గుర్తించి,  ప్రజల సహకారంతో సమగ్ర సమాచారం సేకరించాల్సిన అవసరాన్ని తెలియజేశారు.
పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారిపై 1942 మంది గంజాయి నేరస్తుల కదలికల మీద నిఘా కోసం హిస్టరీ షీట్స్ తెరవడం జరిగినది. మరియు 127 మంది ముద్దాయి ల మీద PIT NDPS చట్టం ప్రయోగించడానికి ప్రతిపాదించి 39 మందిని జైల్ కి పంపడం జరిగినది.  
గంజాయి కేసులో నిందితులుగా ఉండి తప్పించుకుని తిరుగుతున్న ముద్దాయిలను  త్వరితగతిన  అరెస్టు చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడమైనది. 
చాలా కాలంగా పెండింగు లో ఉన్న కేసులు ను త్వరగా దర్యాప్తు చేసి కోర్టు లో చార్జి షీట్ లను దాఖలు చేయమమని ఆదేశాలు ఇవ్వడమైనది
గంజాయి నిర్మూలన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'సంకల్పం 2.0' (సంకల్పం/అభ్యుదయం, చైతన్యం 2.0) కార్యక్రమం అమలు తీరును సమీక్షించి, క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. 
గ్రామాలలో, విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలు, ప్రతిజ్ఞలు నిర్వహించి, గ్రామాలను "డ్రగ్ రహిత గ్రామాలు" (Drug Free Villages) గా ప్రకటించే దిశగా ప్రతీ పోలీస్ స్టేషన్ కృషి చేసి క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
6. మెడికో లీగల్ కేసులు: 
మెడ్‌లీపిఆర్ (MedLeaPR) వ్యవస్థ వినియోగంలో పోలీస్ అధికారులు ఎదుర్కొంటున్న సాంకేతిక పరమైన ఇబ్బందులు, స్టేషన్ల వారీగా ఉన్న సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి తగిన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి గారు మాట్లాడుతూ, పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించేలా ప్రతి ఒక్క అధికారి బాధ్యతాయుతంగా, ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అవలంబిస్తూనే, నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో విశాఖ రేంజ్‌ను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని అధికారులను ఆదేశించారు.
Breaking News

Subscribe our Newsletter