ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్‌కుమార్ సుడిగాలి పర్యటన..

ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్‌కుమార్ సుడిగాలి పర్యటన..

25/August/2026 20:48    Share:   

రిపోర్టర్ కన్నేపల్లి నాగ శ్రీనివాస శర్మ

ఎలమంచిలి:
 గౌరవ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్‌కుమార్ గారు ఈరోజు ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని సుమారు 25 వార్డుల్లో భారీ బైక్ ర్యాలీతో సుడిగాలి పర్యటన విజయవంతంగా నిర్వహించారు. మధ్యాహ్నం 2:00 నుంచి 5:00 గంటల వరకు జరిగిన ఈ పర్యటనలో ఆయన నూతనంగా నిర్మించిన అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు.

అభివృద్ధి పనుల పరిశీలన:

సుమారు రూ. 6.8 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు మరియు ఇతర అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలుకుతూ "థాంక్యూ ఎమ్మెల్యే సార్" అంటూ నినాదాలు చేశారు.

ప్రజల సమస్యలపై స్పందన:

పర్యటన సందర్భంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్న ఎమ్మెల్యే గారు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు హామీ ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

Breaking News

Subscribe our Newsletter