విద్యార్థులకు చట్టాలపై  అవగాహన సదస్సు ...!!

విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు ...!!

27/May/2026 20:52    Share:   

ఎలమంచిలి మండలంలో గురజాడ అప్పారావు డిగ్రీ కళాశాలలో ఈరోజు బుధవారం నాడు జిల్లా న్యాయ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు ఈ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో విద్యార్థుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సమాధాన్ సమరోహ 2026 సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు నిమిత్తం దేశవ్యాప్తంగా న్యాయం కోసం సమన్యాయం కోసం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రజలందరికీ న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సమాధాన్ సమరోహ భారతదేశ ఉన్నత న్యాయస్థానం వారు సంవత్సరాల కొలది కొలువున్న కేసులను గుర్తించి వాటిని మధ్యవర్తి తో గాని లోక్ అదాలత్ లో పరిష్కారం చేయడం కోసం నోటీసులు పంపించి లోక్ అదాలత్ ద్వారా ఆ కేసులు నుంచి విముక్తి కావలసిందిగా కోరుకుంటున్నాం అన్నారు. జిల్లా న్యాయ సేవ సంస్థ అధికారంలో మధ్యవర్తి సేవ నడుస్తుందని మన జిల్లా పరిధిలో 76 న్యాయవాదులుఉన్నారు అని అన్నారు. వివిధ కేసులు పరిష్కారం చేయడంలో సహాయ పడుతున్నారని చాలా మట్టుకు కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం అవుతున్నాయని, ఇరు పార్టీలు వారిని న్యాయస్థాన పిలిపించి వారితో చర్చించి ప్రతి విషయాలు రాసుకొని ఇరువు వర్గాలు గెలిచినట్లుగా కేసు పరిష్కారం అవుతుందని ఎవరైనా పేదవారు క్రిమినల్, సివిల్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వారికి ఉచిత న్యాయవాదిని ఇప్పించి ఆ కేసులు పరిస్కరించుకోవచ్చు అని తెలిపారు, అదేవిధంగా ఏవైనా న్యాయ సలహాలు కావాలనుకుంటే15100 కి కాల్ చేసి తెలుసుకోవచ్చని లేదా మండల లీగల్ సిర్వీస్ కమిటీ  ద్వారా గాని జిల్లా కమిటీ ద్వారా గాని న్యాయ సేవ అధికార సంస్థ వారి ద్వారా తెలుసుకోవచ్చు అని  తెలిపినారు, సీనియర్ లాయర్స్ కొన్ని చట్టాల కోసం చర్చించారు ముఖ్యంగా మహిళల పట్ల జరిగే ప్రమాదాలు నిమిత్తం ఫోక్సో కేసులు మరియు బాల్య వ్యవహారాలు పట్ల అవగాహన హిందూ వివాహ చట్టం మరియు వరకట్నo తీసుకున్న వారికి ఉన్న కేసు సీనియర్ లాయర్స్ వివరించారు ,సీనియర్ లాయర్స్ శ్రీనివాసరావు, ఎస్ నాగేశ్వరరావు, కెవిఎస్ జగదీశ్వర్ రెడ్డి, సిహెచ్ భాస్కరరావు, శ్రీలక్ష్మిరాంబాబు హిందూ వివాహ చట్టం గురించి ,స్కిల్ హబ్ కోఆర్డినేటర్ ప్రసన్నకుమార్, కె . నాదస్వరూప, నిర్మలాదేవి, పారా లీగల్ వాలంటీర్లు విద్యార్థులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter