సురక్షిత ప్రయాణం.. క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్: ఎన్.సి.సి క్యాడెట్లకు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్  అవగాహన  కార్యక్రమం

సురక్షిత ప్రయాణం.. క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్: ఎన్.సి.సి క్యాడెట్లకు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అవగాహన కార్యక్రమం

05/May/2026 19:46    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
ఏలూరు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీ లక్ష్మణ రావు గారి ఆధ్వ ర్యంలో సుమారు 150 మంది ఎన్.సి.సి క్యాడెట్‌లకు రహదారి నిబంధన లపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కమాండెంట్ కల్నల్ అమిస్ పాండా గారు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం అనేది కేవలం నిబంధన మాత్రమే కాదు, అది ప్రాణ రక్షణకు అత్యంత ముఖ్యమని వివరించారు.ప్రమాదం జరిగిన మొదటి గంట గోల్డెన్ అవర్ అత్యంత విలువైనదని, ఆ సమయంలో బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారిని ప్రభుత్వం గుడ్ సమారిటన్గా గుర్తిస్తుందని తెలిపారు. అటువంటి వారికి ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవని భరోసా ఇచ్చారు.రహదారి ప్రమాద బాధితులకు తక్షణ ఆర్థిక మరియు వైద్య సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన **Road Accident Help and Assistance  పథకం గురించి క్యాడెట్‌ లకు వివరించారు. అతివేగం ప్రాణాంతకం అని హెచ్చరిస్తూ, మైనర్ల కు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదా లను, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే ఎదురయ్యే చట్టపరమైన చర్యలను తెలియజేశారు.క్రమశిక్షణకు మారుపేరైన ఎన్.సి.సి క్యాడెట్‌ లు సమాజంలో ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పించడంలో అంబాసిడర్లుగా పనిచేయాలని, చట్టాన్ని గౌరవిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అధికారులు పిలుపునిచ్చారు. పోలీస్ మరియు ఎన్.సి.సి విభాగాల నుండి పలువురు అధికారులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter