అనకాపల్లి. రవాణా శాఖ అధికారులు సీజ్ చేసిన వాహనాలకు ఈ నెల 19న బహిరంగ వేలం !
09/May/2026 07:13
Share:
శ్రీనివాస్ ఏ క్రైమ్ ఎనాలిసిస్, జిల్లా ఇన్చార్జ్.అనకాపల్లి.
పాల్గొనేవారు ముందు రోజే పత్రాలు సమర్పించాలి: జిల్లా రవాణా అధికారి జి. మనోహర్ పన్నులు, అపరాధ రుసుములు చెల్లించని కారణంగా వివిధ తనిఖీల్లో రవాణా శాఖ అధికారులు సీజ్ చేసిన వాహనాలకు ఈ నెల 19న మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా రవాణా అధికారి జి. మనోహర్ వివరాలు వెల్లడించారు. బకాయిలు చెల్లించాల్సిందిగా కోరినప్పటికీ.. వాహన యజమానుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.వేలంలో పాల్గొనే నిబంధనలు వేలంలో పాల్గొనదలచిన ఆసక్తిగల వ్యక్తులు ముందుగా రూ. 10,000 ధరావత్తు (డిపాజిట్) చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు తమ ఆధార్, జీఎస్‌టీ పత్రాలను వేలానికి ఒకరోజు ముందు సాయంత్రంలోగా సంబంధిత కార్యాలయంలో సమర్పించాలి.సీజ్ గురైన వాహనాల యజమానులకు రవాణా శాఖ ఒక అవకాశం కల్పించింది. వేలం నిర్వహించే సమయం లోపు తమ బకాయిలను పూర్తిగా చెల్లించి, వాహనాలను విడిపించుకోవచ్చని సూచించింది. లేనిపక్షంలో ఆ వాహనాలను కచ్చితంగా వేలం వేయడం జరుగుతుందని అధికారి స్పష్టం చేశారు. ఈ బహిరంగ వేలానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అనకాపల్లి రవాణా శాఖ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చు.