క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
హెరిటేజ్ ఫుడ్స్ డైరీకి పాలు సరఫరా చేసే పాడి రైతుల సంక్షేమంలో భాగంగా, సహజ మరణం చెందిన రైతు కుటుంబానికి రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు.
అచ్యుతాపురం మండలం మడుతూరు గ్రామానికి చెందిన హెరిటేజ్ పాడి రైతు మరిస నూకరాజు ఇటీవల మరణించగా, ఆయన కుటుంబ సభ్యురాలు మరిస సత్యవతికి హెరిటేజ్ డైరీ మేనేజర్ కూండ్రపు శేషు చేతుల మీదుగా రూ.50 వేల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా మేనేజర్ కూండ్రపు శేషు మాట్లాడుతూ, హెరిటేజ్ డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పాడి పశువులకు కేవలం రూ.50కే కృత్రిమ గర్భధారణ సేవలు అందిస్తున్నామని చెప్పారు. అలాగే హెరిటేజ్ డైరీకి పాలు సరఫరా చేస్తున్న ప్రతి గ్రామంలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.
అదేవిధంగా, ప్రమాదవశాత్తు మరణించిన పాడి రైతు కుటుంబానికి రూ.2 లక్షలు, సహజ మరణం సంభవిస్తే రూ.50 వేల ఆర్థిక సహాయం నామినీకి అందజేస్తామని తెలిపారు. జిల్లాలోని ఇతర డైరీలతో పోలిస్తే హెరిటేజ్ డైరీ రైతులకు అధిక ధర చెల్లిస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బలిరెడ్డి శీను, నీరుకొండ సంతోష్, నూనె అప్పారావు, శెట్టి కాసు, ఎస్. అప్పారావు, ఎం. అప్పలరాజు తదితర పాడి రైతులు పాల్గొన్నారు.