సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతోంది..

సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతోంది..

04/May/2026 21:46    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
ప్రజాకర్షక పథకాలైన సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేసే లక్ష్యంతోనే మరింత వేగవంతంగా ముందుకెళ్తున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజలకు అందుబాటులో ఉన్న ఆయన,,, తనను కలిసేందుకు విచ్చేసిన వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే చంటి,,, వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రైతులు, మహిళలు, వృద్ధులు, యువత ఇలా అన్నివర్గాల వారికి చేయూతనందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనకు నాందిపలికిందని తెలిపారు. దాంతోపాటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా సత్వర చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
Breaking News

Subscribe our Newsletter