మొక్కజొన్న రైతాంగాన్ని ఆదుకోండి.రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్...

మొక్కజొన్న రైతాంగాన్ని ఆదుకోండి.రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్...

03/May/2026 21:32    Share:   

ఈనెల 5న ఏలూరు తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు:
మొక్కజొన్న రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో  ఈ నెల 5న తహశీల్దార్  కార్యాలయాల వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
లాభదాయకపంటలు పండించాలని రైతులను ప్రోత్సహించిన ప్రభుత్వం,నేడు మొక్కజొన్న పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా వ్యాపారులు దయాదాక్షిణ్యాలకు వదిలివేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రూ.2400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ వ్యాపారులు క్వింటా రూ.1400 నుంచి రూ.1,700కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. మార్కెట్ ధరల ప్రకారం ప్రతి రైతు క్వింటాకు రూ.700 నుంచి రూ.800 వరకు నష్టపోతున్నారని తెలిపారు. మద్దతు ధర ప్రకారం పంట కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాస్తూ రైతులను మభ్య పెడుతోందని ఎద్దేవా చేశారు. లేఖలతో మభ్య పెట్టడం మునుకోవాలని,రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా సంప్రదించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు తెరిచి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని అన్నారు.ఈనెల 5వ తేదీన సిపిఐ,రైతు సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్  కార్యాలయాల వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ప్రభాకర్ పిలుపునిచ్చారు.
Breaking News

Subscribe our Newsletter