అనంతపురం: విద్యాబుద్ధులు నేర్పాల్సిన విద్యాసంస్థల ప్రతినిధులు బరితెగించారు. తమ కాలేజీపై తప్పుడు కథనాలు రాశారన్న నెపంతో ఓ జర్నలిస్టుపై అమానుషంగా ప్రవర్తించారు. కనీసం పక్కనే చిన్నపిల్లాడు ఉన్నాడనే విచక్షణ కూడా లేకుండా, ఆ చిన్నారి ముందే తండ్రిని అవమానపరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
అనంతపురంలోని గీతం కాలేజీ యాజమాన్యం, తమ సంస్థకు వ్యతిరేక వార్తలు రాశారన్న కోపంతో సదరు జర్నలిస్టు ఇంటికి వెళ్లారు. అక్కడ జర్నలిస్టును బెదిరించడమే కాకుండా, తన తండ్రిని చూసి భయంతో వణికిపోతున్న చిన్న కుమారుడి ముందే జర్నలిస్టును బలవంతంగా కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్నారు.
వార్తల్లో నిజానిజాలు ఉంటే చట్టపరంగా ఎదుర్కోవాలి కానీ, ఇలా ఇంటికి వెళ్లి పసివాడి ముందే ఒక తండ్రిని, జర్నలిస్టును అవమానపరచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులైన గీతం కాలేజీ ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.జర్నలిస్టుపై జరిగిన అమానుష దాడిని నిరసిస్తూ వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు మరియు జర్నలిస్టు సంఘాలు అనంతపురంలో ఆందోళనలు చేపట్టారు. వార్తలు రాసినందుకు ఒక జర్నలిస్టు ఇంటికి వెళ్లి, చిన్నపిల్లాడి ముందే అతడిని అవమానించడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా వారు అభివర్ణిస్తున్నారు.
క ఘటనకు బాధ్యులైన కాలేజీ ప్రతినిధులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిని అరెస్టు చేయాలని జర్నలిస్టు యూనియన్లు పోలీసులను డిమాండ్ చేస్తున్నాయి.
బాధితుడు మరియు జర్నలిస్టు సంఘాల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టినట్లు సమాచారం: ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, పోలీసులు దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే ఘటనపై ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.గీతం కాలేజీకి చెందిన ఏ ప్రతినిధులు ఈ దాడిలో పాల్గొన్నారనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు
https://x.com/greatandhranews/status/2050772166841717185?s=20