పాపికొండల అభయారణ్య పరిధిలోని గ్రామాలకు త్వరలో పునరావాసం

పాపికొండల అభయారణ్య పరిధిలోని గ్రామాలకు త్వరలో పునరావాసం

02/May/2026 19:02    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
ఏలూరు, 
పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని   పాపికొండ వన్యప్రాణి సంరక్షణా ప్రాంతంలోని 21 గ్రామాలకు సంబంధించిన సర్వే పనులను ఆ గ్రామాలలోని నిర్వాసితులకు  పునరావాస   ప్రణాళికపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ శనివారం రాష్ట్ర సచివాలయం నుండి ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లు,  పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, రాష్ట్ర ఆర్ అండ్ ఆర్ కమిషనర్లతో రాష్ట్ర సచివాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.  ఏలూరు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ పాపికొండ వన్యప్రాణి సంరక్షణా ప్రాంతంలోని 21 గ్రామాలకు సంబంధించిన సర్వే పనులను ఆ గ్రామాలలోని నిర్వాసితులకు పునరావాస ప్రణాళికను రూపొందించి వెంటనే సమర్పించాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ సాయిప్రసాద్ ఆదేశించారు.
Breaking News

Subscribe our Newsletter