యలమంచిలి
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రమాదవశాత్తు చనిపోయిన, గాయాలు పాలైన కార్మికులకు పది లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, పెండింగ్ క్లైములు మంజూరు చేసి అర్హులైన కార్మికులందరికీ సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేర్చాలని పిల్లల చదువుకు స్కాలర్షిప్లు ఇవ్వాలని భవన నిర్మాణ కార్మికులు ద్వారా సంక్షేమ బోర్డు కు కట్టిన డబ్బులు కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలని పెండింగ్ క్లైములు మంజూరు చేయాలని ఎలమంచిలి కార్మిక శాఖ అధికారికి వినతిపత్రం అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో భవన నిర్మాణం కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చందక రామకృష్ణ, శ్రీ దుర్గాంబిక భవన కార్మిక సంఘం అధ్యక్షులు సేరం రాంబాబు, శ్రీ మణికంఠ భావన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రాజన్న రాంబాబు ,సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము పాల్గొన్నారు