పోలీసు శాఖలో సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ పొందిన అధికారులకు ఘన వీడ్కోలు

పోలీసు శాఖలో సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ పొందిన అధికారులకు ఘన వీడ్కోలు

30/May/2026 17:40    Share:   

అనకాపల్లి, 
పోలీసు శాఖలో దశాబ్దాల పాటు నిస్వార్థ సేవలు అందించి, క్రమశిక్షణతో కూడిన విధి నిర్వహణతో ఆదర్శంగా నిలిచిన ముగ్గురు అధికారులకు అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నాడు ఆత్మీయ వీడ్కోలు సభ అత్యంత వైభవంగా నిర్వహించారు.
నేడు పదవీ విరమణ పొందిన వారు: 
​శ్రీ బి.రామ్ కుమార్ (ఏఎస్ఐ, అనకాపల్లి టౌన్ పి.ఎస్) 
​శ్రీ వి.త్రినాథ్ రావు (ఏఎస్ఐ, పరవాడ పి.ఎస్) 
​శ్రీ ఎల్.గోవింద రావు (ఏఆర్ హెచ్.సీ) ​
​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్, పదవీ విరమణ పొందిన అధికారులను మరియు వారి కుటుంబ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: 
​"పోలీసు వృత్తి ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. అటువంటి బాధ్యతాయుతమైన రంగంలో 36 ఏళ్లు (త్రినాథ్ రావు, గోవిందరావు), మరియు 35 ఏళ్ల (రామ్ కుమార్) పాటు నిబద్ధతతో పనిచేయడం సామాన్యమైన విషయం కాదు. ఉమ్మడి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో వీరు అందించిన సేవలు శాఖకు గర్వకారణం. విశ్రాంత జీవితం కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా, ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను. విశ్రాంత జీవితంలో కూడా జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది."​ఈ సభలో అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన అధికారుల సుదీర్ఘ అనుభవాన్ని కొనియాడారు.​"శాఖలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుంటూ, నిరంతరం ప్రజల రక్షణ కోసం అంకితభావంతో పనిచేసిన మీ సేవలు చిరస్మరణీయం. యువ పోలీసు అధికారులకు మీ క్రమశిక్షణే మార్గదర్శకం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీకు వెన్నుముకగా నిలిచిన మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు" అని పేర్కొన్నారు.
​సత్కారం అందుకున్న అనంతరం పదవీ విరమణ పొందిన అధికారులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ సుదీర్ఘ సర్వీసులో ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. ఇన్నేళ్లపాటు తమ విధి నిర్వహణకు సహకరించిన పై అధికారులకు, తోటి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖ కుటుంబం నుంచి విడిపోవడం బాధగా ఉన్నప్పటికీ, ఇంతటి ఘన వీడ్కోలు లభించడం ఎప్పటికీ మరువలేమని  పేర్కొన్నారు.​ఈ వేడుకలో డీఎస్పీ శ్రీ జీ.ఆర్.ఆర్.మోహన్, ఏ.ఓ. శ్రీ సి.హెచ్.తిలక్ బాబు, ఇన్స్పెక్టర్లు బాల సూర్యరావు, లక్ష్మి, రామకృష్ణారావు, సీనియర్ అసిస్టెంట్ అప్పలరాజు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని రిటైర్డ్ అధికారులకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Breaking News

Subscribe our Newsletter