ఏలూరు పార్లమెంట్ స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీ సమీక్ష సమావేశం..
08/September/2026 19:52
Share:
ఏలూరు పార్లమెంట్ స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీతో బొలిశెట్టి శ్రీనివాస్ గారి సమీక్ష సమావేశం..
- స్థానిక సంస్థలు ఎన్నికల్లో జనసేన మరియు కూటమి పార్టీల విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలి..
- సమన్వయమే విజయానికి తొలి అడుగు..
- మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడి..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో ఏలూరు అమలాపురం, పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తగా రాష్ట్ర ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించిన నేపథ్యంలో ఏలూరు పార్లమెంటరీ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ మరియు సపోర్టింగ్ టీం సభ్యులతో కలిసి ఏలూరు ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యచరణ ప్రణాళిక పై కమిటీ సభ్యులతో బొలిశెట్టి శ్రీనివాస్ గారు విస్తృతంగా చర్చించారు.. ఏలూరు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల వారీగా స్థానిక పరిస్థితులు పార్టీ బలం, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక అంశాలు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సమాచారాన్ని సంబంధిత సభ్యులను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా జనసేన పార్టీ క్షేత్రస్థాయి పరిస్థితులతో పాటు, ఎన్డీఏ కూటమి నాయకులతో సమన్వయం, ఎన్నికల సమయంలో జనసేన పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలు తదితర అంశాలపై కమిటీ సభ్యులకు బొలిశెట్టి శ్రీనివాస్ గారు దిశనిర్దేశం చేశారు.. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీతో పాటు, ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరు సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని ఆయన సూచించారు.. ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన కార్యచరణ, నిర్వహించాల్సిన సమావేశాలు, పార్టీ నాయకులు, మరియు కార్యకర్తలతో చేపట్టాల్సిన సమన్వయ కార్యక్రమాలపై కూడా ఈ సందర్భంగా ఆయన చర్చించారు.. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ సభ్యులకు ఈ నెల 9వ తేదీన మంగళగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అవగాహన మరియు మార్గదర్శక కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హాజరు కావాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు.. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా , సమర్థవంతమైన ప్రణాళికతో ముందుకు సాగుతూ, కూటమి నాయకులు, జనసేన పార్టీ శ్రేణులు అందరితో సమన్వయం చేసుకొని, ఎన్నికల్లో విజయాన్ని సాధించే దిశగా ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ సమన్వయ కమిటీ సభ్యులు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ ఏలూరు జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నారా శేషు, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, ఏలూరు పార్లమెంట్ సహాయక బృందం సభ్యులు (సపోర్టింగ్ టీమ్ సభ్యులు) వలవల తాతాజీ, తిరుపతి వాసు, జె.బిపిన్ కుమార్ (జనసేన రవి), వి. వెంకటేశ్వరరావు, పాశం నాగబాబు, అడపా నాగరాజు, సూరతుల రాఘవ మణికంఠ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..