అనకాపల్లి ATM మోసం కేసులో నిందితుడు అరెస్ట్..

అనకాపల్లి ATM మోసం కేసులో నిందితుడు అరెస్ట్..

12/August/2026 21:06    Share:   

అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో ATM మోసం కేసులో పోలీసులు విజయవంతంగా నిందితుడిని అరెస్ట్ చేశారు.

కేసు వివరాలు

  • కేసు నమోదు సంఖ్య: Cr. No.156/2026 (U/s 318(4) BNS-2023)

  • స్వాధీనం చేసుకున్న సొత్తు: రూ.10,000/- నగదు

  • ఫిర్యాదుదారు: ఆకెళ్ల సూర్యనారాయణమూర్తి (76), రిటైర్డ్ GVMC ఉద్యోగి, ఎన్జీవోస్ కాలనీ, కొత్తూరు పంచాయతీ, అనకాపల్లి మండలం

  • నేరం జరిగిన ప్రదేశం: SBI ATM, మెయిన్ రోడ్డు, మాణిక్య లాడ్జి కింద, అనకాపల్లి పట్టణం

ఘటన వివరాలు

తేదీ 04.08.2026న బాధితుడు ATM లావాదేవీ చేస్తుండగా, నిందితుడు ప్రత్తి రాజేష్ (29) సహాయం చేస్తానని నమ్మబలికి, బాధితుడి ATM కార్డ్ మరియు PIN వివరాలను మోసపూరితంగా సేకరించాడు. అనంతరం బాధితుడి ఖాతా నుండి రూ.10,000/- నగదు విత్‌డ్రా చేసి పరారయ్యాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, CCTV ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. తేది 12.08.2026న మధ్యాహ్నం 3 గంటలకు రైల్వే స్టేషన్ సమీపంలోని గూడ్స్ రోడ్ ప్రాంతంలో సంచరిస్తున్న నిందితుడిని ఎస్ఐ A.వెంకటేశ్వరరావు మరియు సిబ్బంది అదుపులోకి తీసుకుని, చోరీకి గురైన రూ.10,000/- నగదును స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడి వివరాలు

  • పేరు: ప్రత్తి రాజేష్ (29)

  • తండ్రి: శ్రీనివాస్

  • కులం & వృత్తి: కాపు | కూలీ పనులు

  • ప్రస్తుత నివాసం: గూడ్స్ రోడ్, అనకాపల్లి

  • సొంత ఊరు: అయోధ్యరామపురం, సామర్లకోట మండలం, కాకినాడ జిల్లా

నేర చరిత్ర

నిందితుడిపై 2022లో అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయబడింది. దర్యాప్తులో అతడు గతంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 12 దొంగతనం మరియు చీటింగ్ కేసుల్లో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లినట్లు వెల్లడైంది.

​Cr. No. 269/2019 U/s 379, 420 IPC – అనకాపల్లి టౌన్ P.S.​Cr. No. 1536/2020 U/s 379, 420 IPC – అనకాపల్లి టౌన్ P.S.​Cr. No. 76/2021 U/s 420 IPC – కాకినాడ P.S.​Cr. No. 129/2021 U/s 420 IPC – కాకినాడ P.S.​Cr. No. 223/2021 U/s 420 IPC – కాకినాడ టౌన్ P.S.​Cr. No. 233/2021 U/s 379, 411, 420 IPC – సర్పవరం P.S.​Cr. No. 07/2022 U/s 379, 420 IPC – అనకాపల్లి టౌన్ P.S.​Cr. No. 478/2022 U/s 380, 420 IPC – దువ్వాడ P.S., విశాఖపట్నం సిటీ​Cr. No. 179/2023 U/s 379, 411, 420 IPC – సర్పవరం P.S.​Cr. No. 02/2023 U/s 380, 420 IPC – దువ్వాడ P.S., విశాఖపట్నం సిటీ​Cr. No. 03/2023 U/s 380, 420 IPC – దువ్వాడ P.S., విశాఖపట్నం సిటీ​Cr. No. 04/2023 U/s 379, 420 IPC – ద్వారకా P.S., విశాఖపట్నం సిటీ
​ 
అధికారులు & ప్రతిభ కనబరిచిన సిబ్బంది: 
A.వెంకటేశ్వరరావు, సబ్-ఇన్స్పెక్టర్ (SI), అనకాపల్లి టౌన్ P.S.​సహకరించిన పోలీస్ సిబ్బంది:​PC-2178, M. సముద్రం (అనకాపల్లి టౌన్ P.S.)
​PC-2291, R.P. నాయుడు (అనకాపల్లి టౌన్ P.S.)​PC-2342, T.S. నాయుడు (అనకాపల్లి టౌన్ P.S.)​అరెస్టు చేసిన నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచడమైనది.
Breaking News

Subscribe our Newsletter