ప్రేమ సమాజంలో ఘనంగా ధర్మశ్రీ జన్మదిన వేడుకలు

ప్రేమ సమాజంలో ఘనంగా ధర్మశ్రీ జన్మదిన వేడుకలు

31/July/2026 20:51    Share:   

యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ  జన్మదినం సందర్భంగా, కొక్కిరాపల్లి ప్రేమ సమాజంలో అనాధ చిన్నారులు, వృద్ధులను కలిసి వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించే చిన్న ప్రయత్నం చేయడం జరిగింది.అమ్మానాన్నల ప్రేమకు దూరమైన చిన్నారులు... జీవిత చరమాంకంలో తోడు కోసం ఎదురుచూస్తున్న వృద్ధుల మధ్య జన్మదిన వేడుకలు జరపడం నిజమైన సేవకు నిదర్శనం. ఈ సందర్భంగా వారికి పండ్లు, బిస్కెట్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి, వారి ఆశీస్సులు పొందడం జరిగింది.ఈ సేవా కార్యక్రమానికి కావలసిన సామగ్రిని  ఉప్పులూరు కిరణ్ కుమార్  విరాళంగా అందించి, తమ సేవాభావాన్ని చాటుకున్నారు.  
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యలమంచిలి జెడ్పీటీసీ  రాము  హాజరై సేవా కార్యక్రమాన్ని అభినందించారు.ఒకరి పుట్టినరోజు... మరొకరి జీవితంలో ఆనందాన్ని నింపితేనే ఆ పుట్టినరోజుకు అసలైన అర్థం వస్తుంది అనే భావంతో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం అందరి హృదయాలను తాకింది.ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల యువజన విభాగం అధ్యక్షులు, సోషల్ మీడియా అధ్యక్షులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, కరణం ధర్మశ్రీ  సేవా స్ఫూర్తిని కొనసాగిస్తామని సంకల్పించారు.
Breaking News

Subscribe our Newsletter