మాల్స్ పనిచేస్తున్న కార్మికులకు కనీసం వేతనాలు అమలు చెయ్యాలి సిఐటియు.
28/July/2026 20:31
Share:
షాప్లు షాపింగ్ మాల్స్ పనిచేస్తున్న కార్మికులారా వేతనాలు పెంపు కోసం పోరాడుదాం తరలిరండి సిఐటియు
షాపులు షాపింగ్ మాల్స్ లో పనిచేస్తున్న కార్మికులకు కనీసం వేతనాలు అమలు చేయాలంటూ జూలై 30 తేదీన కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది సిఐటియు మండల కన్వీనర్ కూండ్రపు సోము నాయుడు మాట్లాడుతూ షాప్లు,షాపింగ్ మాల్స్లో పనిచేస్తూ కొనుగోలుదారులకు సేవలందిస్తున్న షాప్ ఎంప్లాయిస్ కు కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా ఉండదు ఎన్ని గంటలైనా నిలబడి పనిచేయాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేటు యజమాల వద్ద పనిచేసే కార్మికులకు చట్టప్రకారంగా ఐదు సంవత్సరాల కోసారి వేతనాలు పంచి వాటిని అమలు చేయాలి లని సిఐటియు డిమాండ్ చేస్తుంది కార్యక్రమంలో షాపులు షాపింగ్ మాల్స్ లో పనిచేస్తున్న కార్మికులు పాల్గొన్నారు