సమ్మర్ క్యాంప్‌ల ద్వారా విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందాలి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్

సమ్మర్ క్యాంప్‌ల ద్వారా విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందాలి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్

13/May/2026 19:52    Share:   

సమ్మర్ క్యాంప్‌ల ద్వారా విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందాలి క్రీడా సామాగ్రి కిట్స్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్

అనకాపల్లి( కలెక్టరేట్), మే 13: విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం అనకాపల్లి కలెక్టరేట్‌లో సమ్మర్ క్యాంప్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం సందర్భంగా కశింకోట మండలం బయ్యవరం సెయింట్ జోసెఫ్ స్కూల్‌కు సంబంధించిన క్రీడా సామాగ్రి కిట్స్‌ను విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు క్రీడలు, వ్యాయామం, సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. మే 1 నుండి మే 30, 2026 వరకు నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్‌లను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆకాంక్షించారు.విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు కృషి చేస్తున్న సంబంధిత గేమ్స్ కోచ్‌ను జిల్లా కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి పి.శైలజ, కోచ్ సిహెచ్ సూరి అప్పారావు, విద్యార్థులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter