నిందితుడి అరెస్ట్ – 45.190 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం
12/November/2026 20:29
Share:
అనకాపల్లి , నవంబర్ 12: అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ పి.వి.వి. నరసింహారావు గారి మార్గదర్శకత్వంలో క్రైమ్ నంబర్: 161/2026 U/s 305(a) BNS, అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్. , సి.ఐ జి.ప్రేమ కుమార్ గారి పర్యవేక్షణలో అనకాపల్లి టౌన్ పోలీసులు ఇంటి దొంగతనం కేసును చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి 45.190 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి పట్టణం, గాంధీనగరం ప్రాంతానికి చెందిన మెల్లిపాక ప్రమీల గారి ఇంటిలో గత ఆగస్టు నెలలో గుర్తుతెలియని వ్యక్తి బీరువా తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలను దొంగిలించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 161/2026 U/s 305(a) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, అనకాపల్లి టౌన్ ఎస్.ఐ ఎ.వెంకటేశ్వరరావు గారు తన సిబ్బందితో కలిసి ఈ రోజు (12.11.2026) మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో అనకాపల్లి పట్టణంలోని సిటీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా, లక్ష్మీదేవిపేట రైల్వే గేట్ రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుడి వివరాలు:పేరు: పోణకర్లపల్లి నాగేంద్రకుమార్ (25 సం||), తండ్రి: నాగేశ్వరరావు, వృత్తి: శ్రీ మరిడమాంబ హెయిర్ స్టైల్ షాప్, చిన్నబాబు కాలనీ, ప్రస్తుత నివాసం: అంజయ్య కాలనీ, గాంధీనగరం, అనకాపల్లి పట్టణం.స్వస్థలం: గుల్లిపల్లి గ్రామం, కె.కోటపాడు మండలం, అనకాపల్లి జిల్లా.స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల వివరాలు (మొత్తం 45.190 గ్రాములు): 1.బంగారు నల్లపూసల తాడు – 24.840 గ్రాములు 2.బంగారు నెక్లెస్ – 8.500 గ్రాములు 3.బంగారు చైనుతో కూడిన లాకెట్ – 6.420 గ్రాములు 4.బంగారు బ్రాస్లెట్ – 3.140 గ్రాములు 5.బంగారు ఉంగరం – 2.290 గ్రాములు
నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న అనంతరం చట్టపరమైన చర్యలు పూర్తి చేసి గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. ఈ కేసు ఛేదనలో అనకాపల్లి టౌన్ ఎస్.ఐ ఎ. వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు PC-2178 ఎం.సముద్రం, PC-2291 ఆర్.పి.నాయుడు, మరియు PC-2342 టి.ఎస్.నాయుడు పాల్గొన్నారు. కేసును త్వరితగతిన ఛేదించి చోరీ సొత్తును రికవరీ చేసిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.