దుప్పితూరు గ్రామాన్ని తరలించాలి,  సిపిఎం డిమాండ్

దుప్పితూరు గ్రామాన్ని తరలించాలి,  సిపిఎం డిమాండ్

10/April/2026 12:57    Share:   

యలమంచిలి అచ్చుతాపురం మండలం 
దుప్పితూరు గ్రామాన్ని తరలించాలని సిపిఎం పార్టీ బృందం గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రుత్తలి శంకరరావు ,సీనియర్ నాయకులు కర్రి అప్పారావు మాట్లాడుతూ  గత 22 సంవత్సరాలుగా దుప్పుతూరు గ్రామాన్ని ఏ ప్రభుత్వం వచ్చిన తరలిస్తామని హామీలు ఇస్తున్నారు తప్ప గ్రామాన్ని మాత్రం తరలించడం లేదని దీంతో గ్రామ ప్రజలు పొల్యూషన్ తో తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని 2006 లో భూములను తక్కువ రేటుకు తీసుకొని,వారి పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని  ఉండటానికి ఇళ్లు,ఉద్యోగాలు నిమిత్తం ఆర్ కార్డులు,R&R ప్యాకేజీ ,రెండు పాడి పశువులు,ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని రైతాంగ పంట  భూములు తీసుకున్నారు. 2006 నుండీ నేటి వరకు ఏ విధమైన హామీలు నేరవేర్చక పోగా,.ఆ గ్రామ రైతులకు ,ఆ ప్రాంత ప్రజలకు   అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, నిరుద్యోగ  సమస్య లేకుండా గ్రామాన్ని అభివృద్ది చేస్తామని నమ్మ బలికారు.కానీ 22 సంవత్సరాలు గడిచినా ఆ యొక్క కంపెనీ యాజమాన్యం నేటి వరకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. .గ్రామం మధ్యలో ఉండగా చుట్టు ప్రహరీ గోడ కడతామని కంపెనీ యాజమాన్యం భూములిచ్చిన అమాయక రైతులను నిరంతరం వెదింపులు,బెదిరింపులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూన్నారు.పూరాతనగ్రామ దేవాలయాలు,గ్రామ స్మాశానం  కంపెనీ యాజమాన్యం వీటిని అనుకోని గోడ నిర్మిస్తే కనీసం చనిపోయిన వారి కర్మకాండలు చేసుకోవడానికి కూడా ఆ గ్రామప్రజలు నోచుకోమని భయభ్రాంతులు చెంది, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ప్యాక్టరీలు నుండి వస్తున్న వ్యర్థాలు మూలంగా నీరు ,పరిసర ప్రాంతాలు కలుషితమై అనారోగ్యాలు బారిన పడుతున్నారు. 2006‌నుండి నేటి వరకు పాత పడి కూలిపోతున్న ఇళ్లు,తాత్కాలికంగా నిర్మించుకున్న రేకు షేడ్డుల్లో నాలుగు ఐదు కుటుంబాలు నివసిస్తూ నిత్యం నరకం చూస్తూన్నారు.ఆ గ్రామాన్ని ఇప్పటి వరకు   అధికారులు గానీ,ప్రజాప్రతినిధులు గానీ సందర్శించి వారు సమస్యలు అడిగిన వారు కరువాయే.ఈ గ్రామం 22 సంవత్సరాలుగా ఏ అభివృద్ధికి నోచుకోలేదు. ఈ గ్రామం R&R ప్యాకేజీలో లేదని మీకు ఏ విధమైన సహాయం అందించలేమని,అధికారులు స్వయంగా చెప్పడం గ్రామ అభివృద్ధి కుంటుపడుతున్నది  దుప్పితూరు గ్రామానికి ఇచ్చిన హామీలు నేరవేర్చాలని .   ప్రభుత్వం   గ్రామాన్ని తరలించి అభివృద్దిచేయాలని, న్యాయమైన డిమాండ్లను  పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం అచ్యుతపురం కన్వీనర్ రొంగలి రాము ,మండల నాయకులు కూండ్రపు సోము నాయుడు,గ్రామ ప్రజలు డి దేవానంద్ ,ప్రగడ శ్రీను, రాజు, అగ్గాల రామారావు ,కె సన్యాసిరావు కొత్తలి లోవరాజు ప్రగడ గోవిందు శెట్టి చందర్రావు బద్ది అమ్మాజీ తదితరులు పాల్గోన్నారు.
Breaking News

Subscribe our Newsletter